బ్రేకింగ్ న్యూస్
• విషాదం నింపిన ఆదివారం.. స్మిమ్మింగ్‌ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి • సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? హైదరాబాద్ వాసులకు సీపీ సజ్జనర్‌ ప్రత్యేక విజ్ఞప్తి • భోగాపురంలో సురక్షితంగా ల్యాండ్ ఎయిన్ ఎయిర్ ఇండియా విమానం • భూ అక్రమాలకు చెక్‌ • పంట బోదెలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ఉత్తరప్రభ

Bureau March 04, 2026 11:35 AM 27 views
ఉత్తరప్రభ

*సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై అసెంబ్లీలో చర్చలో పాల్గొనగా ప్రభుత్వం విప్ గణబాబు*.

విశాఖపట్నం (ఉత్తరప్రభ):


నేడు అసెంబ్లీలో  సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ గ్రామాల (వ్యాపగుంట, చీమలాపల్లి, వెంకటాపురం, పురుషోత్తపురం, అడవివరం) భూ సమస్యపై  జరిగిన చర్చలో పాల్గొన ప్రభుత్వ విప్ మరియు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే  పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) .
 దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు చట్టబద్ధమైన పరిష్కారం చూపి, రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
*చారిత్రక ఆధారాలు స్పష్టంగా ఉన్నా రైతులకు అన్యాయం*
ఈ సందర్భంగా గణబాబు  మాట్లాడుతూ, ఈ ఐదు గ్రామాలు చరిత్రలో విజయనగరం ఇనాం ఎస్టేట్‌లుగా ఉన్నాయని గణంకాలతో వివరించారు:
1903: ఐసిఎస్ గిల్మెన్ సర్వేలోనే వీటిని ఇనాం ఎస్టేట్‌లుగా గుర్తించారు.
1948: ఆంధ్ర ఎస్టేట్ ఎబాలిషన్ యాక్ట్ ప్రకారం ఈ భూములపై రైతులకు, వారి వారసులకు పూర్తి హక్కులు సంక్రమించాలి.
1952: గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఇవి ఇనాం ఎస్టేట్‌లేనని ప్రభుత్వం ధృవీకరించింది.
*లిటిగేషన్ల వల్ల పెరుగుతున్న జాప్యం*
1951లో విజయనగరం ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు, 1952 నాటి గెజిట్ రికార్డులు రైతుల పక్షాన ఉన్నప్పటికీ, మధ్యలో వచ్చిన కొన్ని మెమోలు మరియు 1977 నాటి రెవెన్యూ ఉత్తర్వుల వల్ల ఈ వ్యవహారం న్యాయపరమైన చిక్కుల్లో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేవస్థానం భూములుగా వీటిని పరిగణించడం వల్ల వేలాది మంది రైతులు తమ భూములపై హక్కులు కోల్పోయి, రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే గణబాబు  ప్రధాన డిమాండ్లు & పరిష్కార మార్గాలు:
రికార్డుల పరిశీలన: 1953 ట్రిబ్యునల్ ఆర్డర్, 1950/52 గెజిట్ నోటిఫికేషన్లు మరియు SR నెం. 3549 రికార్డులను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలి.
కోర్టులో బలమైన వాదన: ఈ సమస్యపై హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్లలో జిల్లా కలెక్టర్‌ను 6వ రెస్పాండెంట్‌గా చేర్చి, ప్రభుత్వం తరపున స్పష్టమైన కౌంటర్ దాఖలు చేయాలి.
కాలపరిమితి: అనవసర న్యాయపరమైన జాప్యాన్ని నివారించి, రైతులకు త్వరితగతిన న్యాయం చేయాలి.
"దశాబ్దాల కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న ఈ సమస్య కేవలం సాంకేతిక కారణాల వల్ల ఆగిపోకూడదని, ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి పంచగ్రామాల ప్రజల కల సాకారం చేయాలని" గణబాబు  కోరారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

28 Jul 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```